Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .

by CVR NEWS
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్

కార్పొరేట్ పాఠశాలలకు మేమేం తక్కువ కాదంటూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సత్కారం లభించింది. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాప్‌గా నిలిచిన 100 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్. JCI సికింద్రాబాద్, సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన 6వ స్కాలస్టిక్ హానర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా విద్యాబోధన జరుగుతోందని, విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019315
Total views : 90326

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.