గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే ఆటగాళ్లు అలర్ట్ అయిపోయారు. బస్సు దిగిన తర్వాత మంటలు రేగాయి. కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం గుజరాత్ ఆటగాళ్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.





Total views : 90422