Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Devotional శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

by CVR NEWS
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతినిచ్చారు. వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు,సామాన్య భక్తులకు ఉచిత,శీఘ్ర,అతిశీఘ్ర, దర్శనానికి అవకాశం కల్పించారు.క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

023974
Total views : 143657

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.