Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Latest News అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

by CVR NEWS
అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ మూలాలున్న భారత సంతతి యువకుడు డేవ్ ఫిజీకి మే 29న జెస్నితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం నూతన వధూవరులు హెలికాప్టర్‌లో అట్లాంటాకు బయల్దేరారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ పర్వత ప్రాంతంలో కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఎయిర్‌లైన్స్ పైలట్‌గా పనిచేస్తున్న డేవ్ ఫిజీతో పాటు హెలికాప్టర్ పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. వధువు జెస్ని శిథిలాల కింద చిక్కుకుపోయినప్పటికీ సహాయక బృందాలు ఆమెను సురక్షితంగా బయటకు తీశాయి.
వాతావరణం అనుకూలంగా లేదని, ప్రయాణం వాయిదా వేయాలని డేవ్ మొదట భావించినట్లు ఆయన తండ్రి జార్జ్ ఫిజీ వెల్లడించారు. అయితే తర్వాత ఎక్కువ ఎత్తులో ప్రయాణించాలని నిర్ణయించుకుని హెలికాప్టర్‌లో బయల్దేరినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, ప్రాథమిక నివేదిక 30 రోజుల్లో విడుదల కానున్నట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: