Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.

మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.

by CVR NEWS
మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ

రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు…. దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది… నెల్లూరు జిల్లాలో ఆ నేత ఐదు సార్లు ఎమ్మెల్యే…, ఓసారి మంత్రిగా కూడా కొనసాగారు . ఆయన ప్రస్తుతం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు…? ప్రత్యర్థి బలమైన క్యాష్ పార్టీ అనో ….లేక ప్రత్యర్థికి కౌంటర్ ఇవ్వలేక సైలెంట్ అవుతున్నాడా?…. టోటల్ గా సైలెంట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి…? ఇంతకీ ఎవరా నేత ? ఈ స్టోరీ లో చూద్దాం

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది . ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక బలమైన రాజకీయ నేతగా ఎదిగారు . ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా కోవూరు కు ప్రాతినిధ్యం వహించిన ఆయన, తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించారు. అయితే ఇటీవల కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది. ఒకప్పుడు ప్రజల మధ్య నిరంతరం కనిపించే నాయకుడిగా ఉన్న ఆయన, ఇప్పుడు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని , స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించడం లేదని కేడర్‌ వైసిపి అంటోంది . ఈ పరిణామం కోవూరు రాజకీయాల్లో కొత్త రాజకీయ అనిశ్చితిని తీసుకువచ్చిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి . ప్రసన్న మౌనం వెనుక వ్యూహం ఉందా లేక రాజకీయాల్లో వెనక్కి తగ్గుతున్న సంకేతమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదే సమయంలో కోవూరు నియోజకవర్గ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా చర్చలు జోరందుకున్నాయి. నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌గా మారే అవకాశం ఉందనే ప్రచారం జిల్లాలో రాజకీయ వేడి పెంచుతోంది. అదే నిజమైతే, నల్లపురెడ్డి కుటుంబ రాజకీయ వ్యూహంలో పెద్ద మార్పులు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు, ఆయన వెంకటగిరి వైపు షిఫ్ట్ అవుతారనే చర్చ కూడా వినిపిస్తోంది. నల్లపు రెడ్డి కుటుంబానికి అక్కడ కూడా గతంలో బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కొత్త తరం నాయకత్వం, మారుతున్న స్థానిక రాజకీయ సమీకరణాలు కోవూరు రాజకీయాలను కొత్త దిశగా మలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రసన్న మళ్లీ యాక్టివ్ అవుతారా లేదా తాత్కాలిక మౌనానికే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. మున్ముందు ఏమి జరుగుతుందో చుడాలిమరి

Advertisements

You may also like

Our Visitor

040943
Total views : 212468

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: