Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..

by CVR NEWS
నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మర్రిపాడు, జంగాల కండ్రిక గ్రామాల్లో భారీ గాలుల వీచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తలుపురుపాడు, తరుణవాయి, కొరిమెర్ల, జంగాల కండ్రిక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. రహదారులపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అత్యవసరం లేకపోతే ప్రజలు బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రతను కాపాడుకోవడం ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమని వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019257
Total views : 90166

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.