15
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెం గ్రామ శివారులో ఆదివారం భారీ వర్షం, ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి . బలమైన గాలుల ధాటికి ఓ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది. సుమారు 50 మీటర్ల దూరం గాలిలో ఎగిరి రోడ్డుకు అవతలి వైపు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన సమయంలో రోడ్డుపై ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది . షెడ్డు ఎగిరిపడిన దృశ్యంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దింతో భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో కూడా వర్షాలు, గాలులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్థానికులకు అప్రమత్తత అవసరం అని స్పష్టం చేశారు.






Total views : 90166