పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలు స్కూల్ బస్సును ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయిపోయింది.
లోపల ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు మొదలెట్టారు. లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో రైలు గేట్లు తెరిచి ఉన్నాయని..బస్సు ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొట్టిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.
పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.
10
previous post




Total views : 212575