Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

by CVR NEWS
సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే బోధించాలని, ఏ విద్యార్థిపైనా బలవంతంగా మతపరమైన అంశాలను రుద్దే హక్కు పాఠశాలలకు లేదని స్పష్టం చేశారు. అమాయక పసిపిల్లల మనసుల్లో చిన్న వయసులోనే మతపరమైన ఆలోచనలను జొప్పించేందుకు జరుగుతున్న బహిరంగ ప్రయత్నమిది అని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ముస్లిం సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు నీచ రాజకీయాల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. సదరు పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం, విద్యాశాఖ తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే మిగతా స్కూళ్లపైనా నిఘా పెంచాలని డిమాండ్ చేశారు

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: