Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ..

కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ..

by CVR NEWS
కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన

ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేసారు . ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు .ఉదయం 10:50 నిమిషాలకి చామవరం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు .అక్కడ సీఎం చంద్రబాబుకి ముఖ్య నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. హెలిప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు చామవరం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు .11 గంటల నుంచి 12.40 వరకు చంద్రబాబు ప్రజా వేదిక వద్ద ప్రజలతో మమేకమవుతారు, ప్రజా సమస్యలను తెలుసుకుంటారు . 2:00 గంటలకు చంద్రబాబు చామవరం గ్రామానికి వెళ్తారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తారు . 2:40 నిమిషాలకు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు . 4:15కి తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు .అక్కడ నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళతారు.సీఎం పర్యటన సాఫీగా జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు .

Advertisements

You may also like

Our Visitor

040832
Total views : 212192

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: