Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన..

నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన..

by CVR NEWS
నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన

నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రసవ వేదనలో ఉన్న ఓ గర్భిణి అటవీ ప్రాంతంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం జరిగింది. ఈ ఘటన మరోసారి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరతను వెలుగులోకి తెచ్చింది. అయితే, గర్భిణిని ఎడ్లబండిపై అంబులెన్స్ వరకు తీసుకెళ్లేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రం కావడంతో అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఆమె ప్రసవించింది. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నప్పటికీ, రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గర్భిణి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు అత్యవసర వైద్య సేవలు అందేలా ప్రభుత్వం తక్షణమే రహదారి సదుపాయాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

040832
Total views : 212192

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: