యాంటీ బయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ | Antibiotics
యాంటీ బయాటిక్స్(Antibiotics) అందుబాటులో ఉండడంతో ప్రజలు కామన్ కోల్డ్‌కి కూడా యంటీ బయాటిక్ వేసేసుకుంటున్నారు, లైవ్ స్టాక్‌కి ఇంజెక్ట్ చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్‌లో సరైన ప్రొసీజర్, పరిశుభ్రత ఉండడం లేదు. ఇవన్నీ కలిపి యాంటీ బయాటిక్స్‌ని తట్టుకుని ఉండే బ్యాక్టీరియా బాగా విస్తరిస్తోంది. కొన్ని యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడడం వల్ల వీటిని తట్టుకుని ఉండే శక్తి బ్యాక్టీరియాకి వస్తోంది.
Follow us on: Facebook, YouTube, Twitter, Instagram
ప్రముఖ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పేగుల్లో ఇన్ఫెక్షన్ (ఐబీడీ)తో బాధపడుతున్నారని అంచనా.వచ్చే దశాబ్దంలో వీరి సంఖ్య మరింత పెరుగుతుందనీ భావిస్తున్నారు. ఐబీడీలో క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని రెండు సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా పేగుల్లో ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ నియంత్రించడానికి ఇచ్చే నైట్రోఇమిడజోల్స్, ఫ్లూరోక్వినలోన్స్ రకం మందులతో ఎక్కువ ముప్పు పొంచి ఉంటున్నట్టూ పరిశీలనలో వెల్లడైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read Also: గోళ్లు కొరుకుతున్నారా..?
ఈ యాంటీబయోటిక్ మందులు పేగుల్లో ఇన్ఫెక్షన్ కు కారణమైన హానికారక బ్యాక్టీరియానే కాదు, మన ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియానూ కూడా నశింపజేస్తుంది. ఫలితంగా తీవ్రమైన పేగు అల్సర్లు, పేగు పూత (ఐబీడీ) వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న వయసులోనే విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు వాడడం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై పేగు పూత (ఐబీడీ) సమస్య తలెత్తుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడివారిలో దీని ముప్పు ఇంకాస్త అధికంగా ఉంటున్నట్టు పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.