ఉత్తరాఖండ్ లో నవంబరు 12న ఓ టన్నెల్ కూలిపోగా, 17 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టన్నెల్ లోనే చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను ఎట్టకేలకు సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. అధికారులు, సిబ్బంది పడిన శ్రమకు ఫలితం దక్కింది. కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగా, టన్నెల్ నుంచి కార్మికులను విడతల వారీగా బయటికి తీసుకువచ్చారు. వారిని ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా చిన్యాలిసౌర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మందికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. వారికి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లేంతవరకు ఆసుపత్రుల్లో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also..