హైదరాబాద్ లో తెలుగు సినిమాకు ఐకాన్ గా , ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్ (Sri Sarathi Studios) కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి సినిమాల వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో, ఈ స్టూడియోస్ ను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించింది. కాగా శుక్రవారం ఆహ్లాదభరిత వాతావరణంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డాల్బీ మిక్సింగ్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా, సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంబించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ చైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, లోగడ ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్ గా మార్చాలన్న ఆలోచన చేసి, ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్ గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకునివచ్చాం. మేము ఈ రోజు ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ లు చాలా చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా “కల్కి” అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం” అని అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు మాట్లాడుతూ, మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే,, పోస్ట్ ప్రొడక్షన్స్ తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన ఎక్విప్ మెంట్ అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, ఇంకా పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు పాల్గొని, స్టూడియో యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.
- లీకైన జననాయగన్ సినిమా ..చెన్నైలో టీవీకే అధినేత విజయ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన “జన నాయగన్” సినిమా లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే సెన్సార్ సమస్యలతో సంక్రాంతి నుంచి వాయిదా పడిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆన్లైన్లో…
- ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా?ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా? ఒక కథ ఆ సమాజంలో అనుమానాల అగ్నిని రాజేస్తుందా? అంటే అక్షరాల పాకిస్థాన్‌లో అదే జరుగుతోంది .“దురంధర్” సినిమా రిలీజ్ తర్వాత అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఒకరిపై…
- తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి చేరింది.తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా…




Total views : 33634