ప్రస్తుతకాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో స్మార్ట్ పరికరాల హవా నడుస్తుంది. ఇటీవల కాలంలో టీవీల్లో ఆండ్రాయిడ్ టీవీలు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఎయిర్టెల్ అందించే డీటీహెచ్ సర్వీసులతో పాత డబ్బా టీవీను కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని మనకు నచ్చిన చానెల్‌ను ఆశ్వాదించవచ్చు. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ డీటీహెచ్ (డైరెక్ట్-టు-హోమ్) విభాగం వినియోగదారులకు ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌ను అందిస్తుంది. దీన్ని ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌గా పేర్కొంటున్నారు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సేవలు చాలా కాలంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లాంటిది. ఈ బాక్స్ ద్వారా మీరు ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారమ్ కోసం అందుబాటులో ఉన్న 5,000 కంటే ఎక్కువ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. అలాగే మీకు కావాల్సినప్పుడు మీరు లీనియర్ టీవీ కంటెంట్‌కి మారవచ్చు. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌కాస్ట్ ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటే ఎయిర్టెల్ నుంచి ఎక్స్ట్రీమ్ బాక్స్ అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్‌తో వస్తుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ప్రత్యేకతలు.
పాత టీవీను నయా ఆండ్రాయిడ్ టీవీగా మార్చాలా? ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌తో సాధ్యం
95
previous post