ప్రముఖ ఇన్స్టంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. వాట్సాప్ కంపెనీ ఇప్పుడు మరో ప్రత్యేక ఫీచర్ తీసుకొస్తోంది. ఒకేసారి 2GB డేటా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సహాయంతో ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచి ఫైల్స్‌ను అత్యంత వేగంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని ద్వారా పెద్ద ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. బ్లూటూత్ ఆన్ చేయడం ద్వారా మీరు సమీపంలోని వాట్సాప్ యూజర్లకు ఫైల్స్ ను సులభంగా పంపొచ్చు. అయితే మీరు పండానికి ముందు అవతలి వైపు వ్యక్తి మీకు యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు ఫైల్ FTPకి బదిలీ చేయబడుతుంది. ఇలా కేబుల్స్, నెట్ వర్క్ అవసరం లేకుండా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కనెక్టివిటీతో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా పక్కన ఉన్న వారిలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు నియర్ బై షేర్, IOS యూజర్లకు ఎయిర్ డ్రాప్ తరహాలో ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ ఫీచర్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. అంటే, యూజర్లు సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకునేలా ఈ ఫీచర్ పని చేస్తుంది.
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..!
72
previous post