ఈ దశలో ఆస్ట్రేలియా అభివృద్ధి చేస్తోన్న సూపర్ కంప్యూర్ వచ్చే ఏడాది యాక్టీవ్‌గా మారడానికి సిద్ధంగా వుంది. కృత్రిమ మేథ రాకతో రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ నుంచి మానవాళికి ఏం ముప్పు పొంచుకొస్తుందోనని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషితో సమానంగా కొన్ని సార్లు మనిషిని మించిన శక్తి సామర్ద్యాలను కంప్యూటర్లు చూపాయి. ఈ సంచలనాత్మక వ్యవస్థ పూర్తి స్థాయిలో మానవ మెదడును పోలినట్లుగానే రూపొందించారు. తక్కువ విద్యుత్ వినియోగంతోనే మనిషి మెదడు ఎలా సమర్ధవంతంగా విస్తారమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయగలుగుతుందనే రహస్యాలను విప్పే లక్ష్యంతో శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. సిడ్నీలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ న్యూరో మార్ఫిక్ సిస్టమ్స్ పరిశోధకులు ఈ సూపర్ కంప్యూటర్ సృష్టికర్తలు. దీనిని ‘‘డీప్‌సౌత్’’గా పిలుస్తున్నారు. దానిలో అమర్చిన చిప్‌లలో స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్‌లు వున్నాయి. ఇంటెల్, డెల్‌లు కూడా ఈ ప్రయోగంలో తమ సహకారం అందించాయి. మన మెదడు సమాచారాన్ని ఎలా విశ్లేషించి నిర్వహించగలుగుతుందనే రహస్యాలను అన్‌లాక్ చేయడమే లక్ష్యంగా డీప్‌సౌత్ ప్రాజెక్ట్ పనిచేయనుంది. హార్డ్‌వేర్‌ను ఉపయోగించి సెకనుకు 228 ట్రిలియన్ సినాప్టిక్ ఆపరేషన్ల వద్ద స్పైకింగ్ న్యూరాన్ల వంటి భారీ నెట్‌వర్క్‌లను ఇది అనుకరిస్తుంది. మానవ మెదడులోని కార్యకలాపాల అంచనా రేటుకు పోటీగా ఇది వుంటుంది. తక్కువ శక్తి, ఎక్కువ సామర్ధ్యాలను ఇది అనుమతిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో వున్న సూపర్ కంప్యూటర్లతో పోలిస్తే డీప్‌సౌత్ పనితీరు వేరుగా వుంది. సాంప్రదాయ కంప్యూటింగ్ లోడ్ల కోసం ఆప్టిమైజ్ చేయబడిన సూపర్ కంప్యూటర్ల పనితీరుని ఇది విభేదిస్తుందని ఐసీఎన్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రీ స్కైక్ అన్నారు.
Read Also..
Read Also..