ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఎవరూ ఉండడం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. దీనివల్ల అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. అయితే చాలామంది రాత్రిపూట స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. చార్జింగ్ ఎప్పుడైనా కొంత సమయం వరకే చేయాలి. లేదంటే ఫోన్ ఆయుష్షు తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్మార్ట్ఫోన్లలో అధిక ఛార్జింగ్‌ను నిరోధించే అదనపు రక్షణ చిప్‌లు ఉన్నాయి. ఈ చిప్స్ వల్ల బ్యాటరీ 100% ఛార్జ్ అయిన వెంటనే ఛార్జింగ్ ఆగిపోతుంది. అయితే రాత్రిపూట ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచినట్లయితే బ్యాటరీ 99%కి వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఇది బ్యాటరీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫోన్ తొందరలోనే పాడవుతుంది. మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే రాత్రిపూట ఛార్జింగ్‌లో ఉంచవద్దు. బదులుగా దానిని 80% నుంచి 90% వరకు ఛార్జ్ చేసి ఆపై దాన్ని అన్‌ప్లగ్ చేయాలి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు ఫోన్ జీవితకాలం ఎక్కువ ఉంటుంది. ఫోన్‌ని పదే పదే ఛార్జ్ చేస్తుంటే పరికరం వేడెక్కుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్ తొలగించాలి. ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిపై ఎలాంటి బరువైన వస్తువు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని కూడా ఛార్జింగ్ పెట్టవద్దు.
స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా..!
50
previous post