దసరా నవరాత్రి ఉత్సవాలు అనంతరం నాలుగు రోజుల తర్వాత అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో 13 పాలెం లకు చెందిన ప్రజలు అంగరంగ వైభవంగా విజయ బేతాళ స్వామి వారి ఉత్సవాలను జరుపుకుంటారు. కోరిన కొరికలు తీర్చే దైవంగా ఈ స్వామివారికి మొక్కుకుంటే విజయం ప్రాప్తిస్తుందని వీరి నమ్మకం. 1967లో వీరి పూర్వీకులు విజయ బేతాళ స్వామి వారి విగ్రహాన్ని రంగూన్ నుండి తీసుకువచ్చి ప్రతిష్టించారని అప్పటినుండి ఎంతో వైభవంగా ఈ విజయ బేతాళ స్వామి ఉత్సవాలను జరుపుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ రూపాలలో 13 వాహనాలను శ్రీ వినాయకుని వాహనం,గరుక్మంతుడు ఏనుగు వాహనం, కనకదుర్గ వాహనం, శ్రీకృష్ణుడి వాహనం, గరుక్మంతుడు వాహనం, హంస వాహనం, ఆంజనేయ స్వామి వాహనం, రాజహంస వాహనం, షిరిడి సాయి వాహనం, సింహ వాహనం, రాజరాజేశ్వరీ వాహనం లను ఊరేగించుకుంటూ విజయ బేతాళ స్వామి గుడి వద్దకు తీసుకువచ్చి అక్కడినుండి అంబాజీపేట సెంటర్ కు తీసుకొస్తారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు సుదూర ప్రాంతాలనుండి తరలివచ్చారు.
అంబాజీపేటలో ఘనంగా శ్రీ విజయ బేతాళ స్వామి వారి వాహన ఊరేగింపు
248
previous post