ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతి కోసం ఆలోచించి.. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశ చరిత్రలో ఆయన అమరజీవిగా ఖ్యాతి పొందారని, ఈ డిసెంబర్ 15 కు ప్రత్యేకత ఉందని, తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అలాగే ఈ రోజు ఉక్కుమనిషి సర్దార్ వల్ల బాబాయ్ పటేల్ వర్ధంతి అని.. దేశం మొత్తం ఏకం అవ్వడంలో ఆయన పాత్ర వర్ణించలేనిదని.. అందుకు ఆయన ఉక్కుమనిషి నిలిచాడని చెప్పుకొచ్చారు. అలాగే మద్రాస్ నుంచి తెలుగు రాష్ట్రంగా ఏపీ ఏర్పడటంలో పొట్టి శ్రీరాములు ఎంతో కృషి చేశారని, మద్రాసులో ఉన్నప్పుడు తెలుగు ప్రజల పరిస్థితి దుర్బలంగా ఉందని చెబుతూ.. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం తర్వాత తెలుగు భాష మాట్లాడే రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే ఏపీ ప్రజలు చాలా కీలక నగరాలను వదులుకున్నారని.. అభివృది చెయడం అక్కడి నుంచి విడిపోయి రావడం మనకు అలవాటు అయిపోయిందని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 140762