అవినీతిని వ్యతిరేకిద్దాం …దేశానికీ కట్టుబడి ఉందాం అనే నినాదంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అధ్వర్యంలో “విజిలెన్స్ అవేర్నెస్ వీక్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ సీఐ ఎదుర్ భాష, విజిలెన్స్ సివిల్ సప్లై కో ఆప్షన్ పిఎస్ఆర్ మూర్తి, రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్, ఉమ్మడి జిల్లాల అధికారి మాసూం భాష, డీఎస్ఓ రఘురాం లు అన్నారు. విజిలెన్స్ వారోత్సవాలలో బాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ స్పందన హాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అధ్వర్యంలో “విజిలెన్స్ అవేర్నెస్ వీక్” సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సరపరాల శాఖ ,రేషన్ షాప్ డీలర్లు ,MLA పాయింట్ ఇంచార్జులు, తదితరులు హాజరయ్యారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాన్ని అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అవినీతిని అంతమొందించి ప్రభుత్వం నుంచి ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా ప్రజలకు అందాల్సిన వాటిని సక్రమమైన మార్గంలో అందేందుకు ప్రతి ఒక్కరు కుడా ప్రయత్నించాలన్నారు. ఎక్కడైనా అవినీతికి జరిగిన పాల్పడుతున్నట్లు తమ దృష్టికి తెచ్చినట్లయితే వారి పై చట్ట పరమైన చర్యలు తిసుకోనబడతయన్నారు.
అవినీతిని వ్యతిరేకిద్దాం.. దేశానికీ కట్టుబడి ఉందాం..
124
previous post