114
ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు చేసిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఖండించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ పై అమానవీయ దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని, ఆయన మంత్రి పినిపే విశ్వరూప్‌కు, ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు.