కర్ణాటకలో పర్యటించనున్న కోమటిరెడ్డి

komatireddy venkatreddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు&period; నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు&period; పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని… అయితే&comma; ఇలాంటి ప్రయోగాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు&period; కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు&period; కర్ణాటక ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను చూసేందుకు&comma; వాటి గురించి తెలుసుకునేందుకు తెలంగాణ నుంచి ఎవరైనా రావచ్చని చెప్పారు&period; అక్కడి సంక్షేమ పథకాలపై ఎవరైనా అసంతృప్తిని వ్యక్తం చేస్తే… లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని అన్నారు&period; ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు&period; రూ&period; 5 లక్షల కోట్ల అప్పులు చేసి&comma; రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు&period; కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలికేందుకే వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు&period; కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ప్రతి గ్రామంలో ప్రచారం చేసి రాష్ట్రంలో ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .