170
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తపై పుంగనూరులో వైసీపీ నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు. పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ అని అన్నారు. పేదలపై పెత్తందారీ పోకడలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని, మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? అని నిలదీశారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని భువనేశ్వరి అన్నారు.