106
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం అని, చంద్రబాబు అమాయకుడని పేర్కొన్నారు. ఇది కావాలని చేసిన చర్యేనని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వెనుక ఉన్నది బీజేపీనే అని ఢిల్లీలో పాలు తాగే పిల్లవాడ్ని అడిగినా చెబుతారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. పేరుకే జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం, సీఐడీ ఉన్నాయే కానీ, దీని వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. జడ్జిలకు 17ఏ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు 40 రోజులకు పైగా సమయం కావాల్సి వచ్చిందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని చింతా మోహన్ స్పష్టం చేశారు.