కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, దలవాయి కొత్తపల్లి, కొత్తపేట, రాజీవ్ కాలనీలో చిన్నారులు ఆదివారం సాయంత్రం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసి సుమారు 14 మంది చిన్నారులను గాయపరిచింది. గాయపడ్డ చిన్నారులు స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళగా కొంతమంది చిన్నారులను అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్లు సూచించడంతో ఇషాంత్(8), యుషశివి(9), ఫైజ్ (2), అములు (11), కౌశిక్ (8), కౌనేష్ (7) చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది చిన్నారులను చికిత్స తీసుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఈవిషయంగాచిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ… తాము నివసిస్తున్న కుప్పం మునిసిపాలిటీ పరిధిలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నపించుకున్న పట్టించుకోక పోవడంతోనే కుక్కలు చిన్నపిల్లపై దాడి చేస్తుందన్నారు. పిచ్చికుక్క చిన్నారులతోపాటు మరికొన్ని కుక్కలను కూడా కరిచిందని ఆ కుక్కలకు పిచ్చి పడితే తాము పిల్లలను బయటకు ఎలా పంపాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుప్పం మున్సిపల్ అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజల కోరుతున్నారు.
చిన్నారుల పై పిచ్చికుక్క బీభత్సం..
127