సనతాన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు కాపాడేందుకు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుక టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ బి. కరుణాకర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎలిశాల రవి ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధిపథంలో నడిపించేలా కృషి చేస్తున్నామని అన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామని అన్నారు. వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలా ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని అన్నారు.
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ సేవలు..
98
previous post