రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ లో పని చేస్తున్న డ్రైవర్ల పై రోజు రోజుకూ దాడులు జరుగుతూనే వున్నాయి. సమాజానికి మర్గానిర్దేసుకులుగా ఉపాధ్యాయులు ఉన్నారు. అటువంటిది ఉపాధ్యాయుడు బస్సు అపలేదన్న అక్రోసంతో డ్రైవర్ ,కండక్టర్ పై చెప్పలేని విదంగా పదజాలంతో దుర్బాశాలాడి దాడి చేసిన ఘటన కడప జిల్లా చక్రాయపేట మండలం లో చోటు చేసుకోంది …వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రాయచోటి డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్ నరసింహులు తెలిపిన వివరాల మేరకు… నిన్న మధ్యాహ్నం రాయచోటి నుంచి వేంపల్లి కి సర్వీసు వెళ్ళడం జరిగింది. నాగులగుట్ట పల్లి దగ్గర బస్సు ఎక్కేందుకు బస్సు ఆపడం జరిగింది. అప్పటికే బస్సు లోపల ప్రయాణికులు విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో ఆపేందుకు వీలు లేక పోవడం తో ఈ బస్సు వెనకాలా బస్సు వస్తుందని చెప్పి వెళ్ళిపోవడం జరిగిందన్నారు. అక్కడే ఉన్నటువంటి ఓ ఉపాధ్యాయుడు కారులో వచ్చి చక్రాయపేట సమీపంలో కారును బస్సుకు అడ్డంగా పెట్టి బస్సు ఎందుకు నిలపలేదు అని డ్రైవర్ నరసింహులు, కండక్టర్ పై దుర్భాషలాడారు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పినప్పటికీ వారిని కూడా తిట్టడం మొదలు పెట్టారు. దీంతో చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు రాయచోటి.. వేంపల్లి అద్దె బస్సులు నిలిపివేశామని మాకు న్యాయం జరిగేంత వరకు సర్వీస్ లు పునరుద్దరించే ప్రసక్తే లేదని వారు తెలియజేశారు. దీంతో సమయానికి బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ పై దాడి చేసిన ఉపాధ్యాయుడు పై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఆర్టిసి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు డిమాండ్ చేశారు.
డ్రైవర్ల పై రోజు రోజుకూ పెరుగుతున్న దాడులు..
135
previous post