నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన టీమిండియా

Advertisements

<p>టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది&period; గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది&period; ఆల్ రౌండ్ ప్రదర్శనతో శివమ్ దుబే ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు&period; బ్యాటింగ్‌లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు&period; గ్రూప్-ఏలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి&comma; ఓటమన్నదే లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టనుంది&period;<&sol;p>&NewLine;<p>అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది&period; ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ&comma; ఇషాన్ కిషన్ వేగంగా ఆడాడు&period; ఆ తర్వాత తిలక్ వర్మ &comma; కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించారు&period; అయితే&comma; అసలు సిసలు విధ్వంసం సృష్టించింది శివమ్ దూబేనే&period; కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు&comma; 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు&period; చివర్లో హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది&period; నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3&comma; ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు&period;<&sol;p>&NewLine;<p>194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ గట్టిగానే పోరాడింది&period; బాస్ à°¡à°¿ లీడ్ &comma; కోలిన్ అకెర్‌మాన్ &comma; జాక్ లయన్-కాచెట్ రాణించారు&period; అయితే&comma; భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు&period; ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు&period; శివమ్ దూబే బంతితోనూ రాణించి 2 వికెట్లు తీయగా&comma; బుమ్రాకు ఒక వికెట్ దక్కింది&period; దీంతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది&period; ఈ విజయంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది&period; తద్వారా 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచింది&period; సూపర్-8లో గ్రూప్-1లో ఉన్న భారత్&&num;8230&semi; ఫిబ్రవరి 22à°¨ దక్షిణాఫ్రికాతో&comma; ఫిబ్రవరి 26à°¨ జింబాబ్వేతో&comma; మార్చి 1à°¨ వెస్టిండీస్ తో తలపడనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

ముంబైపై 4 వికెట్ల విజయంతో KKR ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది..

సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..