117
పుదీపట్ల పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాదారుల నగదు స్వాహా.. బ్రాంచి పోస్ట్ మాస్టర్ దేవిక వద్ద పలువురు నగదు చెల్లించారు. నిబంధనల ప్రకారం డబ్బులు తీసుకుంటే పాస్ బుక్ లో ఎంటర్ చేసి సీల్ వెయ్యాలి ఇక్కడ ఇలా చేయకుండా దాదాపు 50 వేలు స్వాహా చేసేశారని స్థానికుల సమాచారం.. దీంతో దేవికను తప్పించి పోస్ట్ మాస్టర్ గా వేరొకరిని నియమించిన అధికారులు.. ఈ ఘటన పై పోస్ట్ మాస్టర్ నుండి 50 వేలు రికవరీ చేసి ఖాతా దారులకు డిపాజిట్ చేయిస్తామని పోస్టల్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. నగదు స్వాహా నిజమేనని పోస్టల్ ఇన్స్పెక్టర్ సతీష్ నిర్ధారించారు.