బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Advertisements

<p>మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నికల వేళ క్యాతన్‌పల్లి లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది&period; మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వివేక్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు&period; రౌడీయిజం&comma; గూండాయిజాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి వివేక్ క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు&period;<br &sol;>&NewLine;ఈ క్రమంలోనే సుమన్ చేసిన ఆరోపణలకు మంత్రి వివేక్ వెంకటస్వామి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు&period; బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు&period; బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు&period; బాల్క సుమన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు&period; నిన్న చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నిక ఉండటంతో మేము ఉదయం 11 గంటలకే కౌన్సిల్ హాలుకు చేరుకున్నామని అన్నారు&period; కానీ&comma; బీఆర్ఎస్ కౌన్సిలర్లు మధ్యాహ్నం 12 గంటలకు రావడంతో కోరం లేనందున ఎన్నిక వాయిదా పడిందని మంత్రి వివరించారు&period; బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెన్నూరు&comma; క్యాతన్‌పల్లిలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు&period; అప్పట్లో నామినేషన్లు వేసిన వారిని బాల్క సుమన్ వేధించి&comma; బలవంతంగా విత్‌డ్రా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; నేడు తాము ప్రజాస్వామ్య పద్ధతిలో చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నా సుమన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వివేక్ ధ్వజమెత్తారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..