134
పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్స్ వద్ద హిజ్రాలు అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానిక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హిజ్రాలపై స్థానికులు ఆగ్రహించారు. హిజ్రాలు అడ్డు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ప్రజలు తెలియజేశారు. లారీ బోల్తా పడడంతో హిజ్రాలు పరారు అయ్యారు.