సింగనపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

Advertisements

<p>నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు&period; గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు&period; ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి&period; మేకపాటి విక్రమ్ రెడ్డిని మాజీని చేయడం దురదృష్టకరమని&comma; ప్రజలే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు&period; మర్రిపాడు&comma; అనంతసాగరం మండలాలతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా తమపై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో అర్థం కావడం లేదన్నారు&period; ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు&period; ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని&comma; ఆయన అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు&period; ఇదే క్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తమ సొంత నిధులతో 20 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..

గోదావరి ఒడ్డునే దాహార్తి… పినపాకలో తాగునీటి సంక్షోభం..

తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు ..