123
ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గరికపాడు ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఏఎస్పి మహేంద్ర ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. చెక్ పోస్ట్ లో ఎమ్ వి ఐ శేఖర్, అతని వ్యక్తిగత డ్రైవరు, మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఉండగా శేఖర్ వద్ద నుండి 76,000 రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.