అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెన్నూరులో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుపై ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నూరుకు 3 రాష్ట్రాల బస్సులు వస్తాయని.. అందువలన త్వరగా బస్ డిపో పూర్తి చేయాలన్నారు. చెన్నూరు టూ హైదరాబాద్ ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలని మంత్రిని కోరారు. మంచిర్యాల టూ చెన్నూరు వయా బీమారం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి. అలాగే ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు మందమర్రి డిపోకు వచ్చి వెళ్లాలని మంత్రికి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే వివేక్ .
15 ఏళ్లు దాటిన బస్సులన్నింటినీ తొలగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే కొత్త రూట్లకు కూడా బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు మంత్రి పొన్నం . చెన్నూరు బస్ డిపో కోసం 4 కోట్లు మంజూరు చేశామన్నారు. మొదటి విడతగా కోటి 20 లక్షలు చెల్లించిందన్నారు. కాంపౌండ్ వాల్ , బేస్మెంట్ , గారెజ్ పనులు పూర్తయ్యాయి.. కానీ ఆర్టీసీకి సంబంధించిన భూమి హై కోర్టు స్టే ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. హైకోర్టు స్టే ఎత్తివేసిన తర్వాత డిపో ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు మంత్ర పొన్నం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు…
- ‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి…
- విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ…
- ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో…
- రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 57009