ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా.. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని అధికారులు సీఎంకు వివరించారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినా ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందన్నారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50శాతం అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని, అధికారులు తెలిపారు. ఆక్వారైతులు డ్రమ్ముల్లో కొనుగోళ్లు జరుపుతారని వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందన్నారు. పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు, ఫిషరీస్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై తనకు నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ..
15
previous post





Total views : 56519