113
బైరెడ్డిపల్లి మండలం, నెల్లిపట్లలో దళితులు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్లగా కటింగ్ షాప్ అతను నిరాకరించడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్డీవో మనోజ్ కుమార్ రెడ్డి నెల్లిపట్ల గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో అన్ని కులాల వారు సోదరుల్లా మెలగాలని లేని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళితులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దగ్గరుండి దళితులకు హెయిర్ కట్ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు.