పాలకొల్లు పట్టణ పరిధిలోని పేదలకు, మహిళలకు నివాసయోగ్యం కాని ఒక సెంటు ముంపు స్థల పట్టా ఇచ్చి జగన్ ప్రభుత్వం దగా, మోసం చేసినందుకు నిరసనగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, లబ్ధిదారులు, టిడిపి శ్రేణులతో కలిసి మహా పాదయాత్ర ద్వారా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పూలపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి శివదేవుని చిక్కాల నక్కల పుంత వరకు 15 కిలోమీటర్ల పొడవునా వందలాది మంది లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నిమ్మలతో కలిసి నడుస్తూ నిరసనగళం విప్పి కదం తొక్కారు. ఇళ్ల స్థల పట్టాల పేరుతో ప్రభుత్వం దగా, మోసం చేసిందని ప్లకార్డులను ప్రదర్శించారు. పట్టణ పరిధిలోని పేదలకు 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థల పట్టా ఇస్తే చదువులు, జీవనం ఎలా గుతుందన్నారు. పనికిరాని ముంపు భూముల్లో సెంటు స్థలం ఇస్తే పూడికకే రూ 5 లక్షల ఖర్చు అవుతుంది. ఇక ఇల్లు కట్టేది ఎలా ఇది మోసం, దగా కాదా. పనికిరాని సెంటు స్థలం ఇవ్వడం వలన పేదలకు గోరంత.. వైసీపీ నాయకులకు కొండంత మేలు జరిగింది. పట్టణ పరిధిలోనే పేదలు, మహిళలకు సెంటున్నర ఇళ్ల స్థల పట్టా ఇచ్చేవరకు నా పోరాటం ఆగదన్నారు.
Read Also..