జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేస్తున్న ఐదు మంది అంతరాష్ట్ర దొంగలను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదు మందిని అరెస్టు చేసి నలభై లక్షల రూపాయల చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. ఈ ఐదు మంది గతంలో28 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుండి 363 గ్రాముల బంగారు,100 గ్రాముల వెండి,1లక్ష 90 వేల రూపాయల నగదు,15 మోటార్ సైకిళ్ళు, ఎలక్ట్రిక్ పరికరాలు బోరు మోటార్,ఐరన్ కట్టర్, గ్రైండర్ లను స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన చంద్రగిరి,తిరుపతి పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు ఎస్పి. రాబోయే దీపాలి దృష్టిలో ఉంచుకొని ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ,సరఫరా, విక్రయాలు చేసే వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. దీపావళి పండుగ నేపధ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించిన,నిల్వ ఉంచరాదన్నారు. లైసెన్స్ కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలన్నారు. బాణాసంచా వంటి పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదని,బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి.
Read Also..