పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గంలో దొంగ ఓట్లును రాష్ట్ర మంత్రి చేర్పిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో ఏపీ హేట్స్ జగన్ అంటున్నారని, పెంచినవిద్యుత్ చార్జీలు, కరెంటు కోతలు, నాసిరకం మద్యం నుండి ప్రజలకు విముక్తి లభించాలని ఆయన కోరారు. చిలకలూరిపేట దృగ్స్కు గంజాయి కు ప్రముఖ కేంద్రంగా విరాజిల్లుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ గా మారిందన్నారు. ఉచిత ఇసుక విధానం రద్దు వల్ల 35 లక్షల మంది రోడ్డున పడ్డారని ఆయన వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనన్ని కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతున్నారని తెలిపారు. దొంగ ఓట్లు చేర్పించడంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో నానా తంటాలు పడుతున్నారని 733 పెడితే 600 దొంగ ఓట్లుగా తేలినట్లు ఆయన తెలిపారు. చిలకలూరిపేట సంక్రాంతి పాడు, వరపర్ల, నాదెండ్ల వేలూరు తదితర గ్రామాల నుండి భారీ ఎత్తున దొంగ ఓట్లు చేరుస్తున్నారని పుల్లారావు ఆరోపించారు. ఆర్వో పై కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. గోపీనాథరెడ్డి అనే BLO 90 దొంగ ఓట్లు చేర్చారని …ఆయన్ను బాపట్ల ట్రాన్స్ఫర్ చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇక ఉపేక్షించేది లేదని దొంగ ఓట్లు చేర్పిస్తే పోరాటం చేసి దొంగ ఓట్లను తొలగింపజేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా కోర్టులను ఆశ్రయిస్తామని మాజీ మంత్రి పత్తిపాటి మీడియాకు వివరించారు.
Read Also..