దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి టి. హరీష్ రావు స్పష్టం చేశారు. కే ఎల్ యూనివర్సిటీ బోరంపేట క్యాంపస్ లో అత్యాధునికంగా ఏర్పాటుచేసిన ఆపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఐ. టి. ఉద్యోగాలను అందించగలిగామని, పారిశ్రామిక రంగంలో మరో 24 లక్షల ఉద్యోగాలను అందించామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాట్లకు కావాల్సిన అన్ని రకాల మౌళిక వసతులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తద్వారా హైదరాబాద్ నగరం అనేక రంగాల్లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉండటం గర్వించదగ్గ విషయమని అన్నారు. కే ఎల్ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు అమ్మాయిలు 50 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ పొందటం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనేక పధకాలను అందుబాటులోకి తెచ్చామని, వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని హరీష్ రావు చెప్పారు. కే ఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో డిసెంబర్ నెల 15 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు, మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ పోస్టర్ ను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కే ఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ పార్ధసారధి వర్మ, బోరంపేట క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, అజీజ్ నగర్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐ.టీ పరిశ్రమల ఏర్పాటులో హైదరాబాద్ నగరం..
55
previous post