కోనసీమ కాకినాడ జిల్లాలలో టిడిపి జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. రెండు పార్టీల ఆత్మీయ కలయిక చేపడుతున్నారు. ఇందులో ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు విభేదాలు చేరిపోతున్నాయి. మొన్న పిఠాపురం. నిన్న అమలాపురం. ఇలా రోజుకో నియోజకవర్గంలో వివాదాలు బయటపడుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పిఠాపురంలో టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే జనసేన నుంచి మూడు నెలల క్రితమే తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తను తీసుకొచ్చి ఇంచార్జిగా నియమించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయనకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన రాలేదు. ఇన్చార్జిగా శ్రీనివాస్ ఏర్పాటు చేసిన తొలి సమావేశం లొనే జనసేన పార్టీలో కుమ్ములాటలు జరిగాయి. తొలగించిన ఇంచార్జి శేషు కుమారి రాజీనామా చేశారు. తాజాగా టిడిపి జనసేన ఆత్మీయా కలయికలో మరోసారి విభేదాలు బయటపడుతున్నాయి.. కుర్చీలు విరిగిపడ్డాయి. అమలాపురంలోను ఇదే పరిస్థితి. ఇలా ఎక్కడికక్కడ రెండు పార్టీలు ఆధిపత్యం కోసం తన్నుకునే స్థాయికి దిగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాల పై ఆశలు పెట్టుకున్న రెండు పార్టీలు చివరికి వైసీపీకి అప్పగిస్తారని వై సి పి ఆశగా ఎదురు చూస్తోంది. గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. దీంతో జనసేన ఈ జిల్లాలపై కన్నేసింది .అలాగే రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం ద్వారా చంద్రబాబు గోదావరి జిల్లాలను టార్గెట్ చేశారు. అక్కడే మినీ మేనిఫెస్టో ప్రకటించారు .ఈ రెండు పార్టీలు కలిస్తే గోదావరి జిల్లాలు స్వీప్ అవుతాయని రెండు పార్టీల అగ్ర నేతలు భావించారు .కానీ నియోజవర్గ స్థాయి నాయకులు కలవలేక పోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే. అంతేకాదు కొట్టుకుంటున్నారు. దీనితో రెండు పార్టీల పరువు బజార్లు పడుతొంది. దీనిపై మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Read Also..