వైసీపీ ప్రభుత్వ అరాచక, విధ్వంసక పాలన నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు తెదేపా ఇంచార్జ్ వనమాడి కొండబాబు, జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. తెలుగుదేశం – జనసేన ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం ముఖ్య నాయకులతో తెలుగుదేశం, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎజెండా, పార్టీ కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అరాచక పాలనపై పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్ లో నిర్బంధించిన తరువాత పవన్ కళ్యాణ్ తో ములాఖత్ లో చంద్రబాబు ను కలిసి వైసిపి ప్రభుత్వం అరాచక పాలనపై తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోరాటం చేయడం జరుగుతుందని ప్రకటించారని, వైసీపీ ప్రభుత్వ అరాచక, అవినీతి, అసమర్ధత పాలనపై ఉమ్మడి కార్యచరణతో పోరాటం చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా 17 వ తేదీ నుండి తెదేపా జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 18,19 తేదీలలో రాష్ట్రంలో అద్వానంగా తయారైన రోడ్లు దుస్థితిపై టీడీపీ, జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళతామని ప్రకటించారని, నాటి నుండి టీడీపీ, జనసేన కలిసి సమన్వయoతో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఆ విధంగా ఉమ్మడి ఎజెండాను ప్రజలలోకి తీసుకువెళ్లడం జరుగుతుందని, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు సమన్వయoతో ఉమ్మడి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Read Also..