మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో గల వరి కొనుగోలు కేంద్రంలో అకాలంగా కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ఆరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు పంట పండించడం ఒక ఎత్తయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక కష్టనష్టాలు, చీడపీడలను ఓర్చి పండించిన పంటను విక్రయించేంతవరకు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి ఎలాంటి ఆక్షేపణలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
Read Also..