అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ విధానం ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతోందన్నారు. ఏపీ ఐఎంఎస్ యాప్, ఓటీపీ ఆధారిత వ్యవస్థతో అక్రమాలకు తావులేకుండా రైతులకు ఎరువులు అందజేస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వ యాప్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Agriculture
కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది. గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని, గత చైర్మన్ల ఆధీనంలో ఉన్న వసూళ్లతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల చోటుచేసుకున్నట్లు సమాచారం. సెక్రటరీకి ఉండాల్సిన అధికారాలను ఆమె స్వయంగా తీసుకుని, తనకు అనుకూల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. అలాగే సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి జరగాలని నియమం ఉండగా, చైర్మన్ ప్రత్యేక నిర్ణయాల ద్వారా వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా వ్యవహరిస్తే రైతుల సంక్షేమం మైనది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చైర్మన్ సొంతగా తీసుకునే నిర్ణయాలు స్థానికంగా రాజకీయ చర్చలకు కారణమవుతోంది.
చైర్మన్ అలేఖ్య వ్యవహారంపై డైరెక్టర్లు మంత్రి కి ఫిర్యాదు చేసారని, వెంటనే ఆమెను పదవీ నుంచి తొలగించమని కోరారని సమాచారం. రైతుల సమస్యలు, ఎఫ్‌సిఐ గోదాముల వినియోగం, మార్కెట్ వసూళ్ల నిర్వహణ వంటి అంశాల్లో ఆమె నిర్ణయాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య మరింత కఠినంగా మారింది. మార్కెట్ కమిటీలో అధికారాలను దుర్వినియోగం చేయడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్థానిక వ్యవస్థాపకులు, డైరెక్టర్లు భయపడుతున్నారని టాక్ నడుస్తుంది . అవసరమైన సంతకాలు చేయడంలోనూ , నిర్ణయాలు తీసుకోవడంలోనూ విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలేఖ్య తన విధులను సరియైన విధంగా నిర్వహించి, ప్రతి నిర్ణయాన్ని డైరెక్టర్లతో చర్చించి, రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు ఆసక్తిగా మారింది .
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిళ్లిందని అధికారులు వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా అధికారులు తేల్చారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు.
అలాగే, ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సూచించారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఆరు జిల్లాల్లోని 16 మండలాలు, 89 గ్రామాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడిందని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పంటల వారీగా చూస్తే 630 హెక్టార్లలో మొక్కజొన్న, 384 హెక్టార్లలో వరి, మరో 200 హెక్టార్లలో మినుము వంటి పంటలు నీటి పాలయ్యాయని తెలిపారు. అటు అరటి, మామిడి వంటి ఉద్యాన పంటలకు కూడా భారీగా నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా, ప్రతి ఎకరా నష్టాన్ని ఖచ్చితంగా లెక్కించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. నందిపేట్ మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూసినా అందకపోవడంతో రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపించారు. వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేసి, రైతులకు నేరుగా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా ఒక లక్షా 60వేల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉండగా, దాన్ని 2 లక్షల వరకూ పెంచింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. పంట సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది. నిబంధనల ప్రకారం .. సాధారణంగా భూ యజమాని నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. బ్యాంకులు ఎవరో కొందరికి డిపాజిట్లు ఉన్న రైతులకు మాత్రమే ఇలాంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను తీసుకొని అప్పులపాలవుతున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకే ఆర్బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నందున రైతులకు రుణ సదుపాయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఢిల్లీలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ చామల కిరణ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ లను వారి కార్యాలయాలలో కలిశారు. తెలంగాణలో రైతులు పత్తిపంటను ఎక్కువగా పండిస్తుంటారని, కానీ పత్తిని విక్రయించే సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పత్తి రైతుల సమస్యలను లేఖ ద్వారా తెలియజేశారు. ఈ సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తి, చర్చకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. అంతేగాక సమస్యలను పరిష్కరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రులను ఎంపీ చామల కోరారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి మంత్రి నాదెండ్ల క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యల పై రైతులను ఆరా తీశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని.. వడ్లు కొనుగోలు చేసిన 24 గంటల లోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని రైతులు మంత్రికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు.
కాళేశ్వరం లేకున్నా రికార్డుస్థాయిలో వరి సాగు తెలంగాణ రైతుల ఘనత అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమని ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నటు రేవంత్ పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Total views : 199105