ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై కొర్లగుంటకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు చెర్లోపల్లి విజయ రాయల్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వారితో పాటు అనేక మంది స్థానికులకు తిరుపతి ఎమ్మెల్యే మరియు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విజయమ్మతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాఅని, మీ అందరి చేరికతో ఈ ప్రాంతంలో మరింతగా సీఎం వైఎస్ జగనన్న నాయకత్వం బలపడుతుందన్న విశ్వాసం మాకు ఉందని అన్నారు. జగనన్న ఈ నాలుగున్నరేళ్లలో చేసినంత మేలు దేశంలో మరే ముఖ్యమంత్రి చేసి ఉండరు, చేయలేరు అన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.3.35 లక్షల కోట్లు జగనన్న జమ చేశారని, చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనలో కనీసం రూ.2,000 కోట్లు కూడా రాష్ట్ర ప్రజలకు మేలు చేయ లేదని అన్నారు.
పేదలకు మంచి చేసే విషయంలో జగనన్నకు, చంద్రబాబుకు మధ్య ఉన్న వ్యత్యాసానికి ఈ గణాంకాలే నిదర్శనం అని, తిరుపతి అభివృద్ధికే జగనన్న రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తే.. చంద్రబాబు రూ.70 కోట్లు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదని అన్నారు. జగనన్న అదనంగా తిరుపతిలోనే 26,400 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, పారిశుధ్య కార్మికులకు ఒకేసారి ఐదు వేల రూపాయలు పెంచామని గుర్తు చేసారు. కొర్లగుంట రోడ్డుతో సహా తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, లెక్కలేనన్ని ఫ్రీ లెఫ్ట్ రోడ్లు జగనన్న చొరవతోనే వేయడం జరిగిందని, గంగమ్మ గుడి వీధి ఏకంగా సమావేశాలు నిర్వహించుకునే విశాల మైదానంలా మారిపోయిందన్నారు. మనకు ఇంత మంచి చేస్తున్న జగనన్నకు మనం అండగా నిలవాలి భూమన కరుణాకరరెడ్డి కోరారు.
Read Also..