శ్రీశైలంలోని మణికేశ్వరిమాత ఆలయానికి వెళ్లే దారిలోని క్షేత్ర రింగ్ రోడ్డులో భక్తులకు చెందిన మినీ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది తప్పిన పెను ప్రమాదం విజయవాడకు చెందిన టూరిస్ట్ బస్సు భక్తులతో శ్రీశైల మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చి భక్తులను దర్శనానికి వదిలివేసి టోల్గేట్ దగ్గర నుండి ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చి అదుపు చేయలేక బోల్తా వేసినట్టుగా సమాచారం అదృష్టవశాత్తు బస్సులో భక్తులు ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బస్సు బోల్తా పడిన సమయంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది బస్సు ప్రమాదం తెలుసుకున్న శ్రీశైలం సీఐ దివాకర్ రెడ్డి,ఎస్ఐ లక్ష్మణరావు,దేవస్థానం అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బోల్తా పడిన బస్సును పరిశీలించి డ్రైవర్ కి వైద్యం కోసం దేవస్థానం ఆసుపత్రికి తరలించి బస్సు బోల్తా పడిన ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..