కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం లోని పి.ఆర్.. జూనియర్ కళాశాల మైదానంలో కేంద్ర ప్రభుత్వ సాధికారత మంత్రిత్వ శాఖ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిధుల నుంచి మంజూరు చేసిన విద్యుత్ ఆధారిత ట్రై సైకిళ్లు మరియు వినికిడి యంత్రాలు దివ్యాంగులకు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఇలాంటి పథకాలు పొందాలంటే అనేక లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, కానీ వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని అందుకు కారణమైన వాలంటీర్లను సుధీర్ రెడ్డి అభినందించారు. అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… దివ్యాంగులకు పరికరాలు పంపిణీ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా కేవలం కడప జిల్లాలో మాత్రమే దాదాపుగా 9,000 మంది దివ్యాంగులకు పరికరాల పంపిణీ జరుగుతొందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైకాపా ప్రభుత్వం, పేద ప్రజలపై మానవతా దృక్పథం తో పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఒకటవ తారీఖున ఇంటికి రావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. నేను, శాసనసభ్యులు సుధీర్ రెడ్డి ఇద్దరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని.. పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ హౌస్ కమిటీ చైర్మన్ గౌస్లాజం, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బడిగింజల విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ వేల్పుల శివమ్మ, అధికారులు పాల్గొన్నారు.
Read Also..