62
విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయం జగత్ప్రసిద్ధమైంది. ఈ దేవాలయం కాకుండా, ఇక్కడ మరో కనకదుర్గాదేవి గుడి ఉంది. ఈ అమ్మవారి ఆలయం మొగల్రాజపురం కొండమీద ఉంది. కొండ పూర్తిగా ఎక్కకముందే, సుమారు 500 మెట్లు ఎక్కిన తర్వాత ఆలయ మండపం ఎదురౌతుంది. గుడి మండపం వద్ద ఒక సొరంగం ఉంది. అందులో కనకదుర్గాదేవి దర్శనమిస్తుంది. ఇక్కడ ఎలాంటి హడావుడి, ఆర్భాటము కనిపించదు. సిసలైన భక్తులు కోరుకునే ప్రశాంత చిత్తం అనుభూతికొస్తుంది. విజయవాడ దుర్గమ్మ వెలసిన మొదటి మొగల్రాజపురం కొండ మీదేనని, అయితే, ఇక్కడి కంటే ఇంద్రకీలాద్రి కొండమీద అయితే మరింత శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెద్ద గుడి కట్టించారని అంటారు.