మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఫోన్ ను ఎప్పుడూ ముఖానికి దగ్గరగా ఉంచుకోకూడదు. దీనివల్ల ఫోన్ నుంచి బ్యాక్టీరియా ముఖానికి వ్యాపిస్తుంది. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. అలాగే ఫోన్ ఎప్పుడూ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడుస్తుండాలి. 70 శాతం ఆల్కహాల్ ఉండే వైప్స్ తో ఫోన్ ను తుడవడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. చాలా మంది బాత్ రూమ్స్ లోకి కూడా తీసుకువెళ్లి ఉపయోగిస్తుంటారు. దీని వల్ల బ్యాక్టీరియా మరింత ఎక్కువగా చేరుతుంది. బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లకుండా ఉంటేనే ఉత్తమమని సూచిస్తున్నారు. తల, భుజాన్ని గంటల తరబడి వంచి మొబైల్ ను చూడటంవల్ల టెక్స్ట్ నెక్ అనే సమస్య బారిన పడతారు. వెన్ను పైభాగం, భుజాలలో తీవ్రమైన నొప్పితో బాధ పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఫోన్ ఎక్కువసేపు వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు!
66
previous post